Monday, January 20, 2025

పర్సులు కొట్టేసి పట్టుబడ్డ నటి రూపా

- Advertisement -
- Advertisement -

Actor Rupa Dutta arrested for stealing money

బుక్‌ఫెయిర్‌కు వచ్చి చోరీ పని

కొల్‌కతా : బెంగాల్ అందాల నటి రూపా దత్తా పర్సుల చోరీతో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికంగా జరుగుతోన్న అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి నటి రూపా వచ్చారు. ఇతరుల దృష్టి మళ్లిసూ పుస్తకాలు కొంటున్నట్లుగా నటిస్తూ ఆమె చోరీలకు పాల్పడినట్లు నిర్థారించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. టీవీ సీరియల్స్, షోలలో రూపాదత్తా కీలక పాత్రలు పోషించారు. ఉత్సవానికి వచ్చిన దత్తా ఓ దశలో చెత్తబుట్టలో తన వద్ద ఉన్న పర్సు పారివేయడం ఓ పోలీసు గమనించారు. వెంటనే అనుమానం వచ్చి, విచారించగా పలు పొంతన లేని జవాబులు ఇచ్చారని బిధాన్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. తనిఖీలలో ఆమె వద్ద నుంచి పలు పర్సులు, రూ 75వేల నగదు కనుగొన్నారు. వయ్యారంగా వచ్చి, అందరి దృష్టిని మళ్లిస్తూ ఈ నటి చోరీకి పాల్పడినట్లు విచారణలలో వెల్లడైంది. ఇంతకు ముందు రూపాదత్తా చిత్ర ప్రముఖుడు అనురాగ్ కాశ్యప్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. తరువాత ఇవి తప్పని తేలింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News