Wednesday, October 16, 2024

సల్మాన్ ఖాన్  సంపద రూ. 2900 కోట్లు!

- Advertisement -
- Advertisement -

ముంబై: నటుడు సల్మాన్  ఖాన్ అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్నాడు. సినిమాలే కాక ఆయన  ‘బియింగ్ హ్యూమన్’ అనే ఎన్జీవో సంస్థ ద్వారా కూడా చాలా మంది పరిచితుడే. అంతేకాదు ఆయన బిజినెస్ లో కూడా తనదైన ముద్ర వేశారు. ఫోర్బ్స్ ప్రకారం సల్మాన్ ఖాన్ నెట్ వర్త్ రూ . 2900 కోట్లు.  ఆయన అనేక వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. వాటిలో ఫిలిం ప్రొడక్షన్స్, ఫిట్ నెసస్ అండ్ పర్సనల్ కేర్ వంటివి కూడా ఉన్నాయి.

సల్మాన్ ఖాన్  తన  ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ తో 2011లో ఫిలిం ప్రొడక్షన్స్ లోకి ప్రవేశించాడు. ఆయన ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్ కింద ‘చిల్లర్ పార్టీ’ వంటి సినిమా జాతీయ అవార్డు అందుకుంది.

బియింగ్ హ్యూమన్ అనే క్లోథింగ్  బ్రాండ్ ని  సల్మాన్ ఖాన్ 20102లో ఆరంభించారు. అంతేకాక ఆయన బీయింగ్ హ్యూమన్ అనే ఛారిటేబుల్ ఫౌండేషన్ దాతృత్వ సంస్థను కూడా నడుపుతున్నాడు.

SK-27  అనే జిమ్ అండ్ ఫిట్ నెస్ ఈక్విప్ మెంట్ సెంటర్ చైన్ కూడా ఆరంభించారు. 2019 నుంచి ఆయన బ్రాండ్ ఫిట్ నెస్ పరికరాలు కూడా తయారు చేయడం మొదలెట్టింది.

FRSH బ్రాండ్ పేరిట పర్సనల్ కేర్ అండ్ గ్రూమింగ్ రంగంలో కూడా ఓ భాగస్వామిగా ఆయన అడుగుపెట్టారు. అంతేకాదు ట్రావెల్ కంపెనీ Yatra.com అనే దాంట్లో కూడా సల్మాన్ ఖాన్ పెట్టుబడి పెట్టారు. ఇందులో ఐదుగురు భాగస్వాములు కూడా ఉన్నారు.

షార్ట్ వీడియోల ప్లాట్ ఫామ్ ‘చింగారీ’ లో కూడా ఆయన పెట్టుబడి పెట్టారు. అంతేకాదు దానికాయన బ్రాండ్ ఎంబాసిడర్ కూడా. బిజినెస్ లో ఆయన అభిరుచి ఏమిటో కూడా మనకు తెలుస్తోంది. నటనలోనే కాదు బిజినెస్ లో కూడా సల్మాన్ ఖాన్ తనదైన ముద్ర వేస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News