Monday, January 20, 2025

సల్మాన్‌కు, తండ్రికి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

Actor Salman Khan and his father Salim Khan received threatening letters

కృష్ణజింకల వేట సుడులు

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీమ్‌ఖాన్‌లకు బెదిరింపు లేఖలు అందాయి. ఈ లేఖల పూర్వాపరాలను విచారించేందుకు తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆదివారం స్థానిక పోలీసులు తెలిపారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణహత్య దశలో సల్మాన్‌ఖాన్‌ను కూడా తాము లేపేస్తామని గ్యాంగ్‌స్టర్‌లు ఇటీవలే హెచ్చరించారు. ఈ లోగానే సల్మాన్‌కు ఆయన తండ్రికి ప్రాణాలు తీస్తామనే బెదిరింపు లేఖలు అందడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 2018లోనే సల్మాన్‌కు హెచ్చరికలు పంపించింది. కృష్ణజింకల వేట ఉదంతంలో సల్మాన్‌కు తగు శిక్ష తప్పదని ఈ బెదిరింపు వెలువడింది. ఇప్పుడు ఈ విరామం తరువాత తిరిగి సల్మాన్ ఆయన తండ్రి బెదిరింపు లేఖలు అందుకోవడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్‌ను మూసేవాలా హత్య ఉదంతానికి సంబంధించి విచారిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News