సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నారు. సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శరత్ బాబు(71) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనను ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని టి నగర్ కు తరలించారు. అక్కడ శరత్ బాబు నివాసంలో సినీ ప్రముఖ సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం గిండిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపనున్నారు.
కాగా, 250కు పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు హీరోగానే కాకుండా విలన్, సహాయ నటుడిగా కూడా చేశారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస. విజయశంకర దీక్షితులు, సుశీలా దేవి ఆయన తల్లిదండ్రులు.