Saturday, December 28, 2024

నటుడు శరత్ బాబు ఇకలేరు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితమే  తుది శ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు.శరత్ బాబు 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జన్మించారు.

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రేక్షకులను అలరించారు. దాదాపు 50 ఏళ్ల సిని ప్రస్థానంలో 250 పైగా , తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ సినిమాల్లో ఆయన నటించారు. ఇందులో 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 8 నంది పురస్కారాలు అందుకున్నారు. వెండితెర, బుల్లి తెరలపై నటనలో తనదైన ముద్ర వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News