Thursday, December 19, 2024

అజిత్ పవార్ పార్టీలో నటుడు సాయాజీ షిండే చేరిక

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు సాయాజీ షిండే శుక్రవారం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)లో చేరారు. హిందీ, మరాఠీ, తెలుగుతోసహా అనేక భారతీయ భాషా చిత్రాలలో నటించిన సాయాజీ షిండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, రాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు సునీల్ తాత్కేరే సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షిండే స్టార్ క్యాంపేనర్‌గా పనిచేస్తారని అజిత్ పవార్ తెలిపారు. పార్టీలో షిండేకు సముచిత గౌరవాన్ని కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా 65 సంవత్సరాల సాయాజీ షిండే మాట్లాడుతూ తాను అనేక చిత్రాలలో రాజకీయ నాయకుడిగా నటించానని,

అజిత్ పవార్ పనితీరు తనకు నచ్చిందని చెప్పారు. తనకు ఇష్టమైన మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అజిత్ పవార్‌ను కలుసుకున్నానని, తన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి రాజకీయ వ్యవస్థలో భాగం కావలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన షిండే మరాఠీ నాటక రంగస్థలం నుంచి తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1999లో విలన్ పాత్రలో నటించిన శూల్ చిత్రం ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పింది. మరాఠీ, హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగీషు, గుజరాతీ, భోజ్‌పురి చిత్రాలలో కూడా ఆయన నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News