Friday, January 3, 2025

బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

నగర శివార్లలోని తన నివాసంలో ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖర్‌లోని శరద్ కపూర్ నివాసంలో ఈ వారం మొదట్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సినిమా షూటింగ్ గురించి మాట్లాడాలని చెప్పి శరద్ కపూర్ తనను ఇంటికి ఆహఁద్వనించినట్లు 32 ఏళ్ల బాధితురాలు పోలీసులకు తెలిపింది. బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి తనను అసభ్యకరంగా తాకినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. తమ సమావేశం తర్వాత అసభ్యకర భాషను ఉపయోగిస్తూ శరద్ కపూర్ తనకు వాట్సప్ మెసేజ్ పంపినట్లు కూడా ఆమె తెలిపింది. ఫేస్‌బుక్ ద్వారా తనకు కపూర్ పరిచయమయ్యాడని, వీడియో కాల్స్ ద్వారా తమ మధ్య సంభాషణ సాగిందని ఆమె పోలీసులకు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News