Monday, December 23, 2024

చొక్కా ప్యాంట్ తో ఇండస్ట్రీకి వచ్చినోడిని.. నిరూపిస్తే ఇప్పుడే చచ్చిపోతా…

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు హీరోగా పలు సినిమాలతో అలరించిన నటుడు శివాజీ.. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సరీస్ లలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా శివాజీ నటించిన #90’s వెబ్ సిరీస్ విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో శివాజీ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

“ఎప్పుడు పోతామో.. ఎప్పుడు ఉంటామో ఎవరికీ తెలీదు.. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే డబ్బు మిమ్మల్ని ఏ తీరాలకు చేర్చదు.. ఉన్నన్నీ రోజులు సంతోషంగా ఉండాలి. నాపై ఎన్నో కామెంట్స్ వస్తాయి.. వాటన్నింటి తీసుకుంటే.. నేను ముందుకెళ్లలేను. అలాంటి వాటిని.. నేను అస్సుల పట్టించుకోను. రాజకీయాల్లోకి వెళ్లి డబ్బులు బాగా సంపాదించానని నాపై ప్రచారం జరిగింది. నేను కూడా విన్నాను. అలా డబ్బులు సంపాదించానని నిరూపిస్తే.. ఇప్పుడే చచ్చిపోతా. నేను ఎవడి దగ్గర చేయి చాచి అడిగింది లేదు. చొక్కా ప్యాంట్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినోడిని. నాకు ఎందులోనూ, ఎవరితోనూ రిగ్రెట్స్ లేవు” అని చెప్పారు.

అలాగే బిగ్ బాస్ కాంట్రవర్సీపై కూడా ఆయన మాట్లాడుతూ.. “నేను 12వ వారం వరకు టైటిల్ రేసులో ఉన్నాను..ఆ తర్వాత ఏదో తేడా కొట్టింది. నన్ను నెగిటివ్ చేసేలా కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయి. అమర్ కు నాకు మధ్య ఏం జరిగినా అది మా ఇద్దరి చనువు వల్లే జరిగింది” అని తెలిపారు. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News