Monday, December 23, 2024

‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటుడు శ్రవణ్ రాఘవేంద్ర..

- Advertisement -
- Advertisement -

Actor Shravan plant saplings at GHMC Park in Jubilee Hills

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా వందకు పైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న శ్రవణ్ జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. సిద్దిపేట వాసిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. నా చిన్నతనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హరితహారం కార్యక్రమం చేపట్టి లక్షల చెట్లను నాటించారని అప్పుడు విద్యార్థులుగా స్కూల్స్ లో మేం నాటేవాళ్ళమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పటి విజన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రమంతా విస్తరించి హరితహారం ద్వారా ఇప్పుడు ఎక్కడ చూసిన పచ్చని చెట్లు కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం అందులో నేను పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. అనంతరం సినీ నటులు అమిత్ తివారి, ఎంపీ రవి కిషన్, నటి లియోన లీషాయ్ ముగ్గురికి శ్రవణ్ చాలెంజ్ విసిరాడు.

Actor Shravan plant saplings at GHMC Park in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News