Wednesday, January 22, 2025

ఇండిగోపై శృతిహాసన్ ఆగ్రహం..స్పందించిన ఎయిర్‌లైన్స్

- Advertisement -
- Advertisement -

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నటి శృతిహాసన్ ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం కావడమే. దాంతో ఇండిగోపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని చెప్పిన ఆమె కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమనాయాన సంస్థ రోజు రోజుకీ దిగజారుతోందని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. తనతో పాటు పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ వెల్లడించారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు.

ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానాయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఇక శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విష యాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది. అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని దుయ్యబట్టారు. ఉన్న విషయం చెబితే ప్రయాణీకులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News