Monday, December 23, 2024

రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గంత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగా పురంలోని దేవాలయంలో కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్ఎక్స్ 100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం చిత్రంలో శర్వానంద్ తోపాటు సిద్దార్థ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయన్ గా అదితి నటించింది. ఈ మూవీ సమయంలోనే సిద్దార్థ్, అదితి ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరూ పలుసార్లు చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. సిద్దార్థకు ఇది మూడో వివాహం కాగా.. అదితికి రెండో వివాహం. గతంలో వీరు తమ పార్ట్ నర్లకు విడాకులు ఇచ్చి.. సపరేట్ గా ఉంటూ వచ్చారు.

కాగా సిద్దార్థ్ తెలుగులో నువ్వు వస్తానంటే.. నొనద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, అనగగనగా ఓ ధీరుడు, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్, మహా సముద్రం వంటి చిత్రాల్లో నటించాడు. ఇక, అదితి కూడా పలు తెలుగు సినిమాలలో నటించి అలరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News