Wednesday, January 22, 2025

15 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ జోడీ

- Advertisement -
- Advertisement -

నటుడు శివాజీ-లయ.. ఈ జోడీ టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రేక్షకులను అలరించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, శివరామరాజు వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తర్వాత లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడం.. శివాజీ పలు కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. అయితే.. ఈ మధ్య బిగ్ బాస్, 90s సిరీస్ తో శివాజీ అలరించగా.. మరోవైపు సోషల్ మీడియాలో తన డ్యాన్స్ లతో మళ్లీ వెలుగులోకి వచ్చారు లయ.

ఈ క్రమంలో మళ్లీ వీరిద్దరూ కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషనల్ కొత్త చిత్రం ప్రారంభమైంది. శివాజీ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ బోయపాటి స్క్రిప్ట్ అందించారు. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News