Thursday, January 23, 2025

జియా మృతి కేసు: సూరజ్ పంచోలి నిర్దోషిగా కోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: బాలీవుడ్ నటి, మోడల్ జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో 2013 జూన్ 3న అమెరికన్ పౌరురాలైన జియా ఖాన్(25) ఉరివేసుకుని మరణించింది. తొమ్మిది సంవత్సరాలపాటు ఈ కేసు విచారణ సాగింది. బాలువడ్ సినీ దంపతులు ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్ కుమారుడైన సూరజ్(32) ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. వవా సింగ్(2022), టైమ్ టు ద్యాన్స్(2021), శాటిలైట్ శంకర్(2019), హీరో(2014), హఋర్ రాంఝా(2011) చిత్రాలలో సూరజ్ పంచోలి నటించారు.

Also Read: 40 మంది భార్యలకు భర్త ఒక్కడే కానీ…

2007లో రాంగోపాల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన జియా ఖాన్ గజిని, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలలో నటించారు. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సూరజ్‌తో ఆమె ప్రేమలో పడింది. ఆమె గదిలో లభించిన సూసైట్ నోట్‌లో సూరజ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆమె ఆత్మహత్యకు పురిగొల్పిన నిందితునిగా పోలీసులు సూరజ్‌పై కేసు నమోదు చేశారు. ఆమె తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టులో వేసిన పిటిషన్ వేయగా ఈ కేసును 2014 జులై 3న సిబిఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. జియా ఖాన్ మరణించిన వారం రోజుల తర్వాత సెక్షన్ 306 కింద పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేశారు. సూరజ్ తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడంటూ జియా తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News