- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలోలో సుబ్బరాజు పోస్టు చేశాడు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆ జంటకు అభినందనలు తెలిపారు. సుబ్బరాజు సతీమణి గురించి తెలియాల్సి ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖడ్గం సినిమాలో చిన్న పాత్రలో నటించి తెలుగు చిత్ర సీమలోకి తొలి అడుగు పెట్టాడు. అనంతరం అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆర్య, పోకిరి, లీడర్, బిజినెస్ మ్యాన్, బాహుబలి2 వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అభిమానం చురగొన్నారు.
- Advertisement -