Wednesday, January 22, 2025

మళ్లీ అధికారంలోకి జగన్..

- Advertisement -
- Advertisement -

అమరావతి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఖాయమని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామలింగేశ్వర ఆలయంలో సుదర్శించిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతులు (బిసిలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు),  షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) వర్గాలకు చెందిన వారితో సహా అట్టడుగు వర్గాల సమస్యలను సిఎం జగన్ సమర్థవంతంగా పరిష్కరించారని సుమన్ వెల్లడించారు. సీఎం జగన్ చేపట్టిన నవరత్న సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావడం, ఆర్థిక సహాయ ప్యాకేజీల పంపిణీ ఇందుకు కారణమన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఈ కార్యక్రమాల ప్రభావం ప్రత్యేకంగా కనిపించిందని, అవసరమైన వారికి గణనీయమైన సహాయాన్ని అందజేస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News