కోచ్చి: పత్రికా విలేకరులతో మాట్లాడే సమయంలో ఒక మహిళా విలేకరిపై తాకరాని చోట తాకినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి శనివారం క్షమాపణలు చెప్పారు. తన జీవితంలో ఎవరి పట్ల ఆమార్యదకరంగా వ్యవహరించలేదని, సినిమాల్లో కాఆని బయట కాని తాను ఏ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని సురేష్ గోపి పేర్కొన్నారు. తన ప్రవర్తన మనస్థాపానికి గురైన పక్షంలో అందుకు క్షమాపణ చెబుతున్నానని ఆ మహిళా విలేకరిని ఉద్దేశించి ఆయన ప్రకటించారు.
తనకు ఎటువంటి దురుద్దేశం లేదని, తాను ఆ మహిలా విలేకరిని తన కుమార్తెగానే భాస్తున్నానని ఫేస్‌బుక్ పోస్టులో సురేష్ గోపి తెలిపారు. తనను అనుచితంగా తాకినట్లు ఆ మహిళా విలేకరి భావించిన పక్షంలో ఒక తండ్రిలాగ ప్రవర్తించానే తప్ప వేరే ఉద్దేశంతో కాదని ఆయన వివరించారు. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత తాను అక్కడ నుంచి నిష్క్రమించే సమయంలో ఆ విలేకరి దారికి అడ్డుగా ఉన్నారని, తాను ఎటువంటి దురుద్దేశంతో ఆమెను తాకలేదని సురేష్ గోపి చెప్పారు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, తాను ఒక తండ్రిలాగే ఆ మహిళా విలేకరి పట్ల ప్రవర్తించానని ఆయన తెలిపారు. ఆమెకు క్షమాపణ చెప్పేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించానని, అయితే ఆమె స్పందిచలేదని ఆయన వివరించారు. తనపై ఆమె చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని తెలిసిందని, అందుకు తాను ఏమి చేయగలనని ఆయన ప్రశ్నించారు.
ఇలా ఉండగా సురేష్ గోపి ప్రవర్తన అనుచితంగా ఉందంటూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కెయుడబ్లుజె) ఒక ప్రకటనలో పేర్కొంది. మహిళా కమిషన్ వద్ద ఫిర్యాదు చేయాలని తాను భావిస్తున్నామని కెయుడబ్లుజె రాష్ట్ర అధ్యక్షురాలు ఎంవి వినీత, ప్రధాన కార్యదర్శి ఆర్ కిరణ్ బాబు తెలిపారు. శుక్రవారం ఉత్తర కోజిక్కాడ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సురేష్ గోపి పాల్గొన్నారు. ఒక మహిళా జర్నలిస్టు భుజంపై బిజెపికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడైన సురేష్ గోపి చేతులు వేయగా ఆమె రెండుసార్లు చేతులను విదిలించి వేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమంలో దర్శనమివ్వడంతో వివాదం ఏర్పడింది.
Suresh Gopi, #Malayalam film actor & #BJP Rajya Sabha Ex MP from #Kerala, look how indecently he places his hands on a female reporter asking him questions, she had to take his hand off the second time he did it! His speech and body language all inappropriate!
Shame on… pic.twitter.com/zpHjBZtmn1
— Hate Detector 🔍 (@HateDetectors) October 28, 2023