Monday, January 20, 2025

రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న సూర్య

- Advertisement -
- Advertisement -

Actor Surya Received National Award for Soorarai Pottru

హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన 68వ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సూరారై పోట్రు సినిమాలో అద్భుత నటనకు జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డును తమిళ హీరో సూర్య అందుకున్నారు. సూర్యతోపాటు ఇదే సినిమాకు జాతీయ ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా ఎంపికైన హీరోయిన్ అప‌ర్ణ బాల‌ముర‌ళి, జీవీ ప్ర‌కాశ్ కుమార్ లు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. అలాగే, తానాజీ సినిమాకుగాను జాతీయ ఉత్త‌మ న‌టుడుగా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌న్‌ అవార్డు అందుకున్నారు. ఇక, ఎస్ఎస్ థమన్ అలా వైకుంఠపురం సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. కూచిపూడి డ్యాన్సర్ సంధ్యా రాజు ‘నాట్యం’ చిత్రానికిగానూ బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డును అందుకున్నారు.

Actor Surya Received National Award for Soorarai Pottru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News