మనతెలంగాణ/హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో తనీష్ స్పష్టం చేశారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్ర నిర్మాత శంకర్ గౌడ విషయంలో తనకూ నోటీసులు అందినట్లు పేర్కొన్నారు. ఆ నోటీసులు కేవలం విషయ సేకరణకు మాత్రమే ఇచ్చారని, ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో డ్రగ్స్ కేసులో తన కుటుంబం ఎంతో ఇబ్బందిపడిందని, మళ్లీ ఇప్పుడు అవాస్తవాలు ప్రసారం చేస్తూ మానసికవేదనకు గురిచేస్తున్నారని తనీష్ వాపోయారు. వారిపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను రెండేళ్ల కిందట ఓ సినిమా విషయంలో కలిశానని, అప్పటి నుంచి మళ్లీ ఆ నిర్మాతను ఎప్పుడూ కలవలేదని తనీష్ అన్నారు. రెండేళ్లుగా బెంగళూరు వైపే చూడలేదని, పోలీసులు ఇచ్చిన నోటీసులకు తప్పకుండా సమాధానం చెబుతానని హీరో తనీష్ తెలిపారు.
Actor Tanish reacts on Bengaluru drugs Case