కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. ఈనెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా త్రిగుణ్ మీడియాతో మాట్లాడుతూ “రామ్‌గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర, వంగవీటి బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఎక్కువ పాత్రల మీద నడుస్తాయి. ‘కొండా’ అనేది బయో ఫిక్షన్. ఇందులో కొండా మురళి, సురేఖమ్మ అనే రెండు పిల్లర్స్ ఉన్నాయి.
ఉద్యమంలో ప్రేమకథ పుట్టింది. అదొక కమర్షియల్ పాయింట్. ఈ తరహా సినిమాల్లో ప్రేమకథ పెడితే సహజంగా ఉండదు. కానీ ఈ సినిమాలో అదొక నేచురల్ పాయింట్. మురళి, సురేఖమ్మ పాత్రలు, వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకొని వర్మ కొంత కల్పిత కథ రాశారు. ఈ సినిమా కోసం ఆరు, ఏడు కేజీల బరువు పెరిగా. రెండు, మూడు ఫోటోషూట్స్ చేసే సరికి మీసం, గడ్డం… లుక్ అంతా వచ్చేసింది. సమాజంలోని పరిమితులను చేధించుకొని కొండా మురళి ఎదిగారు. జీవితంలో అవరోధాలు వచ్చినప్పుడు తొమ్మిది మంది ఆగుతారు. ఒక్కడు మాత్రం అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్తాడు. ఆ ఒక్కడి కథ… కొండా” అని అన్నారు.
Actor Trigun about Konda Movie