తమిళనాట అగ్రతారల్లో త్రిష ఒకరు. అందం, అభినయం కలబోసిన వ్యక్తిత్వం ఆమె సొంతం. వయసు నలభైకి చేరువవుతున్నా, తనదైన ప్రతిభతో వరుస సినిమాల్లో నటిస్తోందామె. ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇరవై ఎళ్ళుగా వెండితెరపై అలరిస్తున్న త్రిషను ఇటీవల వివాదాలు చుట్టుముడుతున్నాయి.
తమ స్వీయ రాజకీయ లబ్ధికోసం ఉద్దేశపూర్వకంగా ఆమెను వివాదాల్లోకి లాగాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. రెండు నెలల క్రితం సహ నటుడు మన్సూర్ అలీఖాన్ ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే, తాజాగా ఏఐఏడిఎంకె నేత ఏవీ రాజు మరో అడుగు ముందుకు వేసి, ఆమెపై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డాడు. త్రిష 25లక్షలు తీసుకుని ఓ రిసార్ట్ లో గడిపేందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీనిపై తమిళ సినీ పరిశ్రమ భగ్గుమంది. త్రిష కూడా ఏవీ రాజాపై కోర్టుకు వెళ్లింది. అతనిపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. కేసు వివరాలను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇప్పటికైనా త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆగుతాయో లేదో చూడాలి.