Monday, January 20, 2025

గ్యాంగ్ లీడర్ విలన్ జనార్థన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు ఉండడంతో హైదరాబాద్‌లోని ఆపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జనార్థన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు సమీపంలోని పోతనూరులో జన్మించారు. సినిమాలపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 21 ఏళ్ల వయసులోనే అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో సుమలతకు తండ్రి నటించారు. పలు చిత్రాలకు నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News