Thursday, January 23, 2025

‘రామారావు ఆన్ డ్యూటీ’ తృప్తినిచ్చింది

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్ల్లలో రిలీజ్ అవుతోంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు.

‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల నేపథ్యంలో వేణు మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు శరత్ మండవ చెప్పిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ అద్భుతంగా ఉంది. సిఐ మురళి పాత్ర చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది. ఇక నేను చాలా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసినప్పటికీ స్వయంగా డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేది. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో నేనే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్తా. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో నాకు మళ్ళీ ఒక ఫ్లాట్‌ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం రవితేజతో పని చేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఇక ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో వుంది”అని అన్నారు.

Actor Venu interview about ‘Ramarao On Duty’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News