Sunday, January 19, 2025

నటుడు వేణుకు పితృవియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు తొట్టెంపూడి వేణు ఇంట్లో విషాదం నెలకొంది. వేణు తండ్రి ప్రొఫెసర్ వెంకటసుబ్బారావు(92) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయాడు. సినీ ప్రముఖులు సుబ్బారావు మృతిపట్ల సంతాపం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వయవరం అనే మూవీతో వేణు సినీ రంగప్రవేశం చేశారు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరిళితే, పెళ్లాంతో పనేంటి, మళ్లీ మళ్లీ చూడాలని, గోపి… గోపిక.. గోదావరి, రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాలలో వేణు నటించి మెప్పించారు. వేణు కమెడీ ప్రతి సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. వేణు ఉన్నాడంటే కామెడీ ఉండాల్సిందే. ప్రస్తుతం అతిథి అనే వెబ్ సిరీస్‌లో ఆయన నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News