Monday, December 23, 2024

రాజకీయ ప్రస్థానానికి దళపతి విజయ్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రముఖ నటుడు దళపతి విజయ్ తన రాజకీయ పార్టీని నమోదు చేయడానికి సంసిద్ధం అయ్యారు. అందుకు విజయ్ అభిమానుల క్లబ్ ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ జనరల్ కౌన్సిల్ ఆమోదు ముద్ర వేసింది. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు విజయ్ నుంచి ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఇయక్కమ్ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. తన పార్టీని రిజిస్టర్ చేయడానికి, పార్టీ అధ్యక్షునిగా తన పేరు ప్రకటించడానికి, బైలాస్ రూపొందించడానికి కోలీవుడ్ మెగాస్టార్ విజయ్‌కు ఒక బిడ్ ఇవ్వడమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక నెల లోగా పూర్తి కాగలదు.

నటుడు విజయ్‌కు తమిళనాడు, కేరళలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఆయన వివిధ ప్రజా సంక్షేమ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు కూడా. 2018లో తూత్తుకుడి పోలీస్ కాల్పుల్లో మరణించినవారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. తన రాజకీయ అరంగేట్రానికి విజయ్ చాలా పట్టుదలతో ఉన్నారనేందుకు అది సంకేతం అయింది. అప్పటి నుంచి విజయ్ మక్కళ్ ఇయక్కమ్ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నది. అది తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేసింది. గత డిసెంబర్‌లో వరదల్ల వల్ల దక్షిణ జిల్లాలను కూడా విజయ్ సందర్శించి బాధితులకు సహాయ వస్తువులు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News