- Advertisement -
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు.. గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తలించారు. చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఆయన మృతి పట్ల పలువురు నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విజయ్ రంగరాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- Advertisement -