Sunday, December 22, 2024

ఆస్పత్రిలో చేరిన విజయ్‌కాంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటారని డీఎండీకే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, గతకొంతకాలంగా విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయన కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News