హైదరాబాద్: ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న చియాన్ విక్రమ్ తదుపరి చిత్రం ‘చియాన్ 62’కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి, సిందుబాద్ సహా ఇటీవల విడుదలైన సూపర్ చిత్రం చిత్తా(చిన్నా) వంటి డిఫరెంట్ మూవీస్ను తెరకెక్కించి విమర్శకుల
ప్రశంసలు పొందిన దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటెన్స్ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు జాతీయ అవార్డ్ గ్రహీత జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. హెచ్. పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చియాన్ 62 వీడియో గ్లింప్స్‌ను వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ అద్భుతమైన యాక్షన్ను మనం చూడొచ్చు. ఇవి ఈ చిత్రంలో పార్ట్ 1కు సంబంధించిన సన్నివేశాలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.