Monday, December 23, 2024

పెదకాపు… ఒక లైఫ్ స్టొరీ

- Advertisement -
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో విరాట్ కర్ణ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అద్భుతమైన యాక్షన్…
పెదకాపు సినిమాలో యాక్షన్ అంతా సహజంగా ఉంటుంది. ట్రైలర్‌లో చూస్తే యాక్షన్ రా అండ్ రస్టిక్ గా వుంటుంది. పీటర్ హెయిన్స్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు.
బలవంతుడితో సామాన్యుడి పోరాటం…
ఒక సామాన్యుడు అనేక సవాళ్ళని ఎదుర్కొని బలవంతుడితో పోరాడి ఎలా ఎదిగాడనేది పెదకాపు కథ. 1980లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు కూడా అందరూ కొత్తవాళ్ళని తీసుకున్నారు. అలా ఒక సామాన్యుడు ఎదిగిన క్రమాన్ని చూపించడానికి కొత్తవాడైతే బావుంటుందని ఈ సినిమా చేయడం జరిగింది.

కథని నమ్మి తీశారు…
నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి కాకపొతే ఇంతపెద్ద కాన్వాస్ దొరికేది కాదు. నిజానికి నిర్మాత ఈ సినిమా కథని నమ్మి తీశారు. పెదకాపు ఒక లైఫ్ స్టొరీ.
చాలా ఆనందంగా అనిపించింది…
శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే జర్నీ మొదలైన తర్వాత ఫ్రెండ్లీగా కలిసిపోయాం. సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News