Friday, November 15, 2024

సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

చెన్నై : సెన్సార్ బోర్డుకు తాను రూపాయలు ఆరు లక్షల లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని ప్రముఖ బహుభాషా నటుడు విశాల్ ఆరోపించారు. ఇటీవలే విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా పలు భాషలలో విడుదల అయింది. తమ ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు అనుమతికోసం తాను ముంబై సెన్సార్ బోర్డుకు ఆరున్నర లక్షల రూపాయల ముడుపు చెల్లించుకున్నానని ఈ నటుడు గురువారం తెలిపారు. ఇది సెన్సార్ బోర్డు అవినీతికి మచ్చుతునక అని చెప్పిన విశాల్ ఇవి కేవలం ఉత్తుత్తి మాటలు కావని చెపుతూ, బోర్డులోని ఏ అధికారికి, ఏ శాల్తీకి ఎంతెంత ఇచ్చింది? ఈ డబ్బును ఏయే బ్యాంకు ఖాతాలకు పంపించిందీ వివరాలతో తెలిపారు.

తన సినీ జీవితంలో ఇంతవరకూ తనకు ఇటువంటి అనుభవం ఎదురుకాలేదన్నారు. తాను మధ్యవర్తి మనగాకు చెల్లింపులు ఇచ్చుకోవల్సి వచ్చిందన్నారు. తన ప్రకటన ప్రతిని విశాల్ మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండేకు, ప్రధాని మోడీకి కూడా పంపించారు. అవినీతి పలు రంగాలకు విస్తరించుకునిపోయిందని , దీనిని వెండితెరపై బాగా చూపుతున్నామని, చివరికి ఈ తెర కూడా అవినీతితో బాధితమవుతోందన్నారు. సిబిఎఎఫ్‌సి ముంబైలో సాగుతున్న తంతు గురించి తెలుసుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News