Monday, January 20, 2025

‘గామి’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసారు. ఈ పోస్టర్‌లో అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్ టెర్రిఫిక్‌గా వుంది.

డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్‌ని కలిగిస్తోంది. ఈ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ‘శంకర్’ అనే అఘోరాగా కనిపించనున్నారు. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు’ అని మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు, రెండు విభిన్నమైన సెటప్‌లు, ఇతర పాత్రలు ఉన్నాయి’ అని అన్నారు. ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News