Monday, December 23, 2024

పారితోషికం అమాంతం పెంచేసిన వర్ధమాన నటుడు విశ్వక్ సేన్

- Advertisement -
- Advertisement -

VishwakSen-Ashokavanamlo...

హైదరాబాద్: మొదట్లో చిన్నాచితక సినిమాలు చేసినా…ఎవరికీ అంతగా తెలియని వర్ధమాన నటుడు విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వయస్సు ముదిరిపోతున్న బ్రహ్మచారిగా ఫీలయి, కనీసం ఆంధ్ర  ప్రాంతంలో అమ్మాయినైనా చేసుకుందామని, తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లడం,  కరోనా లాక్ డౌన్ కారణంగా అక్కడ ఇరుక్కుపోవడం, పెళ్ళికూతురు లేచిపోవడంతో, ఆమె చెల్లెలు అతడిని ఇష్టపడ్డం తదితర మలుపులతో…కథ నీట్ గా ఉండడంతో సినిమా హిట్ కొట్టింది. దీంతో ఊపొచ్చేసింది అనుకుంటున్నాడేమో…ఇప్పుడు ఆ హిరో అమాంతం తన పారితోషికాన్ని పెంచేశాడని టాక్. రూ. 1.5 నుంచి 2.0 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకునే అతడు ఇప్పుడు తన రెమ్యూనరేషన్ను రూ. 3.00 కోట్లకు అమాంతం పెంచేశాడని వినికిడి. నిర్మాతలకు ఇది షాక్ గా మారిందని టాక్. ఓ మోస్తరుగా ఉండే ఈ హిరో రెమ్యూనరేషన్లో షాకులిస్తుండంటంతో నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

VishwakSen-Pagal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News