Sunday, April 6, 2025

పెళ్లికి సిద్ధమైన అభినయ.. కాబోయే భర్త ఎవరంటే..

- Advertisement -
- Advertisement -

‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అభినయ. ‘శంభో శివ శంభో’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు’, ‘దమ్ము’, ‘రాజు గారి గది-2’ తదితర సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. . కాగా, అభినయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నానని. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్ననని ప్రకటించింది. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది అభినయ. తన కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మార్చి 9వ తేదీన తనకు, స‌న్నీ వ‌ర్మ‌ అనే వ్య‌క్తితో నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. సన్నీ వర్మ ఓ ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News