- Advertisement -
ఇన్నాళ్లు వెండితెరపై అద్భుతమైన నటనతో కట్టిపడేసిన నటి అభినయ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ తో ఆమె ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరిగింది. ఇటీవలే తన నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించిన ఈ అమ్మడు తన కాబోయే భర్త ఫోటోస్ సైతం రివీల్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన టాలీవుడ్ నటి అభినయ.’నేనింతే’ చిత్రంతో తెలుగులో తెరగ్రేటం చేసిన అభినయ శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- Advertisement -