Saturday, December 21, 2024

చెక్‌బౌన్స్ కేసులో నటి అమీషా సరెండర్

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఓ చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ శనివారం స్థానిక సివిల్ కోర్టు ఎదుట లొంగిపొయ్యారు. సీనియర్ న్యాయమూర్తి డిఎన్ శుక్లా ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగతంగా కోర్టుకు ఈ నెల 21వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఈ చెక్ బౌన్స్ కేసు 2018 నాటిది. అప్పట్లో జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ నటిపై చెక్ బౌన్స్, మోసం కేసు పెట్టారు. ఇంతకు ముందు ఆమెకు పలుసార్లు ఈ కేసుకు సంబంధించి కోర్టు సమన్లు వెలువడ్డాయి. అయితే ఆమె హాజరుకాలేదు. దీనితో కోర్టు ఆమెపై వారంటు జారీ చేసింది.

దీనితో ఆమె ఇప్పుడు కోర్టు ముందు హాజరయ్యి , సరెండర్ అయినట్లు ఫిర్యాదీ తరఫు న్యాయవాది విజయలక్ష్మి శ్రీవాత్సవ తెలిపారు. దేశీమ్యాజిక్ అనే సినిమాకోసం నటికి నిర్మాత రూ 2.5 కోట్లు బ్యాంకు ఖాతాకు పంపించారు. అయితే వేరే కారణాలతో నటి ఈ సినిమాలో నటించలేదు. తిరిగి డబ్బులు చెల్లించేందుకు చెక్ పంపించారు. అయితే ఇది బౌన్స్ కావడం కేసుకు దారితీసింది. అమీషా కొన్ని తెలుగు చిత్రాలలో ప్రముఖ హీరోలతో కలిసి నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News