Monday, December 23, 2024

ఉక్రెయిన్ లో నటి ఏంజెలినా జోలి పర్యటన!

- Advertisement -
- Advertisement -

Anjelina 2

లివివ్: ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ప్రత్యేక ప్రతినిధిగా ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి శనివారం ఉక్రెయిన్ లో పర్యటించింది. యుద్ధంలో అందరినీ కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన చిన్నారులను పరామర్శించింది. ఆమె శనివారం లివివ్‌ సిటీలో పర్యటించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆమె అక్కడి వాలంటీర్లతో మాట్లాడింది. ఈ సందర్భంగా వాలంటీర్లు.. అక్కడ తలదాచుకుంటున్న పిల్లలంతా దాదాపు 2 నుంచి 10 ఏళ్లలోపు  పిల్లలే అని చెప్పుకొచ్చారు.

‘వాళ్లు ఇ‍ప్పటికీ షాక్‌లోనే ఉన్నారు.. ఈ యుద్ధ ప్రభావం పిల్లలను ఎంత ప్రభావితం చేస్తుందో నేను ఊహించగలను. వారికోసం నిలబడటం చాలా అవసరం’ అని ఏంజెలినా జోలి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేషన్‌లోని పిల్లలతో, వాలంటీర్లతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. కాగా ఈ యుద్ధం వల్ల గత రెండు నెలల్లో 12.7 మిలియన్ల మంది ప్రజలు(ఉక్రెయిన్‌ జనాభాలో 30% మంది) ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

Anjelina 1

Anjelina 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News