హీరోయిన్ అంజలి గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ భామ సౌత్ భాషలన్నింటిలో నటించింది. ఇప్పటివరకు ఈ భామ కెరీర్‌లో 48 సినిమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే 50 మూవీస్ మార్క్ అందుకోనుంది. త్వరలో ఈ బ్యూటీ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మూవీ ‘వకీల్‌సాబ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా అంజలి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. “నేను ఇప్పుడు ఒకరితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఎవరితో రిలేషన్‌లో ఉన్నాననేది మాత్రం చెప్పలేను. ఈ రిలేషన్‌షిప్ ఇంకా పరిపూర్ణం కాలేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది”అని పేర్కొంది. ఇక ఏప్రిల్ 9న అంజలి నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విజయంపై తనకు చాలా నమ్మకం ఉందని చెప్పింది తెలుగమ్మాయి అంజలి.
Actress Anjali reveals her Relationship