Monday, January 27, 2025

‘జపాన్’ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కానుకగా ఈనెల 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో మాట్లాడుతూ “రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు.

తన ప్రతి సినిమా డిఫరెంట్ గా వుంటుంది. కార్తి, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డీవోపీ రవి వర్మన్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. ఇలా జపాన్ టీం చాలా పెద్దది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇది కార్తికి 25వ చిత్రం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ట్రైలర్, టీజర్ చూస్తే జపాన్ ఒక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది.

కార్తినే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ’జపాన్’ లో నా పాత్ర ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ గా వుంటుంది. దాని గురించి ఇప్పుడే ఎ క్కువగా చెప్పలేను. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితం లో కీలకంగా వుంటుంది. కార్తి, నాకు మధ్య ఆసక్తికరమైన ట్రా క్ వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News