Thursday, January 23, 2025

కృష్ణం రాజు మృతిపై అనుష్క శెట్టి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

 

Krishnam Raju no more

హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణం రాజు(83) మృతిపై నటి అనుష్క శెట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి చేేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించింది. ప్రభాస్, కృష్ణం రాజు కుంటుంబంతో ఆమెకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆమె ప్రభాస్ కు మంచి స్నేహితురాలని ఓ సందర్భంలో కృష్ణం రాజే స్వయంగా  ఓ సారి తెలిపారు. కృష్ణం రాజు మృతి సందర్భంగా అనుష్క ట్వీట్ కూడా చేసింది. ‘‘మాకు ఎంతో ఆత్మీయులైన కృష్ణంరాజు గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. విశాల హృదయం కలిగిన ఓ దిగ్గజం మీరు .. మా హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు’’అంటూ నమస్కారం ఎమోజీలను అనుష్క ట్వీట్ మాదిరి పెట్టింది. ప్రముఖ తెలుగు నటుడు మహేశ్ బాబు కూడా కృష్ణం రాజు మరణంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నటుడు ప్రభాస్ కు, కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని కూడా మహేశ్ బాబు వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News