Monday, December 23, 2024

పోలీసులకు ఫోన్ చేసి నటి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: పోలీసులకు ఫోన్ చేసిన నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టివి నటి మైథిలి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్ పేట ప్రాంతం ఎల్లారెడ్డిగూడలోని మూర్తి అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. మైథిలి పలు టివి సీరియళ్లలో నటిస్తోంది. గతంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండేది. ఆరు నెలల క్రితం తన ఇంట్లో బంగారం చోరీకి గురైందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తూ ఉండేది. పోలీస్ స్టేషన్‌కు వీడియో కాల్ చేసి తనకు న్యాయం జరగడం లేదని గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే పోలీసులు ఆమె ఉన్న స్థలానికి చేరుకొని మైథిలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News