Thursday, January 23, 2025

ఈట‌ల రాజేందర్ తో సినీ నటి దివ్యవాణి భేటీ

- Advertisement -
- Advertisement -

 

Divya Vani met with Eetela

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ(టిడిపి)కి ఇటీవల రాజీనామా చేసిన నటి దివ్యవాణి గురువారం ఉదయం హైద‌రాబాద్ శామీర్‌పేట‌లో ఉన్న ఈట‌ల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆమె త్వరలోనే బిజెపిలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.  త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారు. దివ్యవాణి ముఖ్యంగా తెలంగాణలో యాక్టివ్ గా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె టిడిపిలో చేరారు. అధికార స్పోక్స్ పర్సన్‌గా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే మే నెలలో జరిగిన మహానాడులో జరిగిన ఓ సంఘటనతో దివ్యవాణి తెలుగు దేశం పార్టీకి దూరమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News