Saturday, December 21, 2024

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న హీరోయిన్ ఎస్తర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో సినీ నటి ఎస్తర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్తర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించడం మన కర్తవ్యం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బాపిరాజు, నటుడు అజయ్ కి ఎస్తర్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరింది.

Actress Ester Noronha Plant Sapling in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News