Wednesday, January 22, 2025

బిజెపికి నటి గాయత్రి రఘురామన్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆ పార్టీని వీడుతున్నట్లు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సినీ నటి గాయత్రి రఘురామన్ ప్రకటించారు. తనపైన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌కు అన్నామలై కారణమని ఆమె ఆరోపించారు. 2014లో బిజెపిలో చేరిన గాయత్రి రఘురామన్ నవంబర్ 22న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. డిఎంకె ఎంపి తిరుచి శివ కుమారుడు సూర్య శివను పార్టీలో చేర్చుకోవాలన్న అన్నామలై నిర్ణయాన్ని ఆమె బహిరంగంగా విమర్శించారు. బిజెపి మహిళా నాయకురాలైన ఒకరిని ఫోన్‌లో దూషించిన శివను బిజెపిలో చేర్చుకోవడాన్ని గాయత్రి వ్యతిరేకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News