Monday, December 23, 2024

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తరువాత నటి హేమను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం హేమను ఆస్పత్రికి తరలించారు. మే 20న బెంగుళూరు రేవ్‌ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమతోపాటు పలువురు నటులు పాల్గొన్న విషయం విధితమే. నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలినట్టు పోలీసులు వెల్లడించారు.  మే 27న హాజరు కావాలని పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసింది. తన అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఒక వారం గడువు కావాలని ఆమె కోరారు.  జూన్ 1న విచారణకు హాజరు కావాల్సిందిగా సిసిబి పోలీసులు మరో నోటీసును హేమకు పంపించారు. డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఆమెను అరెస్టు చేసినట్టు సమాచారం.  హేమతో పాటు దాదాపుగా 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించి పరీక్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News