Monday, January 20, 2025

బెంగళూరు రేవ్ పార్టీ కేసు: విచారణకు హాజరుకాలేనని హేమ లేఖ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు తాను హాజరకాలేనని సీసీబీ పోలీసులు నటి హేమ లేఖ రాశారు. ఇవాళ హాజరుకావాలంటూ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బెంగళూరు పోలీసుల నోటీసులకు హేమ రిప్లే ఇచ్చింది. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని.. ఈ కారణంగా విచారణకు రాలేనంటూ లేఖతో తెలిపింది. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరింది. కాగా హేమకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడిన వారిని పోలీసులు బ్లడ్ టెస్టు నిర్వహించగా చాలా మందికి పాజిటీవ్ వచ్చింది. ఇందులో నటి హేమతోపాటు పలువరు టాలీవుడ్ నటులు ఉన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 8 మందిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు ఈరోజు విచారించేందుకు సిద్ధమయ్యారు. నటి హేమ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆమె లేఖ ద్వారా తాను రాలేనంటూ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News