ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయార ని పేర్కొన్నారు.
అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సిసిబి కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. హేమ జైలు నుంచి విడుదలయ్యాక సెక్యూ రిటీ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను కన్నడలో ఏదో ప్రశ్నించారు. దానికి ఆమె బర్త్‌డే పార్టీ అంటూ సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడ కుండా వెళ్తే వేరే రకంగా ఉంటుందని హేమ పక్కన ఉన్న వ్యక్తి ఆమెకు సూచించారు. అయితే, వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముందంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.