Sunday, December 22, 2024

నటి హినా ఖాన్ కు మరోసారి కీమో థెరపీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటి హినా ఖాన్ ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతోందన్నది తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం ఆమె కీమో థెరపీ చేయించుకుంది. ఆ విషయాన్ని ఆమె ఇదివరకే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ చికిత్స చేయించుకుంటోంది. దానికి సంబంధించిన ఆసుపత్రి దృశ్యాలను కూడా షేర్ చేసుకుంది. అంతేకాక ఆమె తనకు ఎంత నొప్పిగా ఉందన్న విషయాన్ని కూడా తెలిపారు. ప్రతి సెకండ్ నొప్పి అనుభవిస్తున్నానని పేర్కొంది.  ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది. దాంతో పాటు ఆమె ఇలా రాసింది ‘‘ మరో రోజు కోసం దువా చేయండి.’’

విశేషమేమిటంటే హినా ఖాన్ స్వయంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలైనప్పటికీ మొండిగా ఆ వ్యాధిని ఎదుర్కొంటోంది. అంతే కాక ఆసుపత్రిలోని ఇతర పేషంట్లను కూడా మోటీవేట్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె విగ్ పెట్టుకుని షూటింగ్ పనులలో కూడా పాల్గొంది.

X post of Hina

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News