Wednesday, December 25, 2024

సుప్రీంకోర్టులో జయప్రదకు ఊరట

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపి జయప్రదకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇఎస్‌ఐసి కేసులో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. తమకు రూ.8 లక్షల ఇఎస్‌ఐ ఇన్స్ రెన్స్ చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధన ఉల్లంఘనలకు పాల్పడిందని థియేటర్‌ కార్మికులు ఎగ్మోర్ సెకెండ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన కోర్టు, ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

అయితే, దీనిపై మద్రాస్ హైకోర్టకు వెళ్లగా జయప్రదకు షాక్ తగిలింది. మెట్రోపాలిటన్ కోర్టును హైకోర్టు సమర్థించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News