Friday, December 20, 2024

సినీ పరిశ్రమలో విషాదం… ఆ నటి ఇకలేరు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి కనకలత(65) కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు 2021లో డిమోన్షియా అనే వ్యాధి సోకడంతో ఎంఆర్‌ఐ స్కాన్ తీయగా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆ వ్యాధి ఎక్కువగా వ్యాపించడంతో అనారోగ్యానికి గురై ఆమె చనిపోయారు. ఆమె ఇప్పటివరకు 360కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉనర్తుపట్టు సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. అన్యార్, వక్కలతు, నారాయణణ్‌కుట్టి, చిరిక్కుడుక్క, అగ్రహారం సినిమాలు ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. కనకలత మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News