Sunday, January 19, 2025

సినీనటి కస్తూరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని తమిళనాడు రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్3వ తేదీ నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చెన్నైకి తరలించారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్ని తెలుగు వారు, ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారని విమర్శించారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని , ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి విమర్శించారు. కస్తూరి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు, తెలుగురు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లే సరికి తాళం వేసి ఉంది. దీంతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసిన చెన్నై పోలీసు ఉన్నతాధికారులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కస్తూరి ఉన్నట్లు తెలుసుకున్న చెన్నై పోలీసులు ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News