Thursday, January 23, 2025

నటి కేతకి చితాలే అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Ketaki
మే 18 వరకు కస్టడీకి 

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌పై పెట్టిన పోస్ట్‌కు మరాఠీ నటి కేతకీ చితాలేను ఆదివారం థానే పోలీసులు అరెస్టు చేశారు.   మే 18 వరకు పోలీసు కస్టడీకి పంపించారు. చితాలే తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మరొక వ్యక్తిని ఉద్దేశిస్తూ మరాఠీ కవితను పోస్ట్ చేసింది.  అది ఇంటిపేరు (పవార్) , వయస్సు (80)ను ప్రస్తావించింది. కానీ  81 ఏళ్ల  ఎన్ సిపి  నాయకుడు బాధపడుతున్న శారీరక రుగ్మతలను కూడా సూచిస్తుంది.

రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఆదివారం ముంబైలోని గోరేగావ్‌లో బిజెపి ర్యాలీ నిర్వహించనుంది. అయితే బిజెపి ర్యాలీ నిర్వహించడం లేదని,  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం బికెసిలో ర్యాలీని నిర్వహించారని  ఫడ్నవీస్ సన్నిహితుడు తెలిపారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం “ముసుగు విప్పేందుకు” ఆదివారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఒకరు తెలిపారు.

మరోవైపు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో శివసేన ‘శివ సంపర్క్ అభియాన్’ జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభను ఉద్దేశించి ప్రసంగించారు.   మహా వికాస్ అఘాడి  ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి , మహారాష్ట్ర నవనిర్మాణ సేన సహా వివిధ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగారు. పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Ketaki

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News